Thursday, March 26, 2020

కరోనా వైరస్ విషయమై కొన్ని అతి ముఖ్యమైన సూచనలు.


1. పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి.
2. సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి.
3. ఒక 15 రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఉవినియోగించకండి.
4. ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి.
5. ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి.
6. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి.
7. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి.
8.జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి.
9. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి.
10. అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు.
11. పనిమనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి.
12. అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి 

Saturday, November 16, 2019

ఇండియా దెబ్బకి బంగ్లా పులులు అబ్బా.






ఇండోర్ వేదిక గా  జరిగిన ఇండియా వర్సెస్ బాంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా ఇన్నింగ్స్ అండ్ 130 రన్స్ తేడాతో గెలిచింది. మయాంక్ అగర్వాల్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట బాటింగ్ చేసిన బంగ్లా ఇండియన్ బౌలర్లు దెబ్బకి 150 పరుగులకే అల్ అవుట్ ఐంది తర్వాత బాటింగ్ కి దిగిన టీం ఇండియా మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ చేయడం తో బారి స్కోర్ సాధించింది. 493/6 స్కోర్ వద్ద ఇండియా డిక్లేర్ ఇవ్వగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లా బ్యాటమెన్స్ ఇండియా బౌలర్లు దెబ్బకి మల్లి కుదేలయ్యారు. 213 పరుగులకే అల్ అవుట్ అయ్యారు ముషఫీక్యూర్ రెహ్మాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయడం తో బంగ్లా 213 పరుగులైన చేయగలింది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 తన కాతా తెరిచింది. 

Thursday, November 14, 2019

జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన దేవినేని అవినాష్






చాల రోజుల నుంచి దేవినేని అవినాష్ వైసీపీ లో చేరుతాడు అన్న ఊహాగానాలు తెర దించుతూ ఈరోజు ఉదయం దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ కి రాజీనామా చేసి జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో ఆయన వైసీపీ పార్టీ లో చేరారు. సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ కి వైసీపీ కండువా కప్పిపార్టీ లో ఆహ్వానించారు. మరియు అవినాష్ తో పటు కడియాల బుచ్చి బాబు కూడా వైసీపీ లో చేరారు. ఆ సమయం లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు తదితరులు కూడా వున్నారు.